AR Rahman : ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖతిజా సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. రెహ్మాన్ సంగీతంలో ‘యంతిరన్’ చిత్రంలో ‘పుదియ మనిదా…’ అనే పాటను ఖతిజా(Khatija Rahman) ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడామె ‘మిన్మిని’ అనే చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు. హలిదా షమీమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలోని ఆడియో ఇప్పటికే రిలీజ్ కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోంది.
AR Rahman Daughter…
ఒక సినిమాకు తొలిసారి సంగీతం సమకూర్చడంపై ఖతిజా రెహ్మాన్(Khatija Rahman) స్పందిస్తూ.. ఈ తరుణం, అనుభవం ఎంతో సంతోషంగా, ఆనందకరంగా ఉంది. సరైన మార్గదర్శకత్వం చేసిన నా కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ‘ మిన్మిని’ వంటి చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే, తమిళంలోనే తొలి చిత్రానికి సంగీతం అందించే అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చి అన్ని విధాలుగా అండగా నిలిచిన హలిదా, మనోజ్ పరమహంస, మురళిలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని అన్నారు. ‘ మిన్మిని’ సినిమా విషయానికి వస్తే.. చిన్నారుల ఇతివృత్తంతో దర్శకురాలు హలీదా షమీమ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో గౌరవ్ కాలై, ప్రవీణ్ కిషోర్, ఎస్తర్ అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, ఖతీజా రెహ్మాన్ సంగీతం అందించారు.
ఈ సినిమా గురించి దర్శకురాలు హలీదా షమీమ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ సినిమా చిన్నపిల్లలతో తీశాను. ఈ పాత్రలకు సంబంధించి రెండో పోర్షన్ వారితోనే తీయాలన్న పట్టుదలతో వారు పెరిగి పెద్దవారయ్యేంత వరకు వేచివుండి సినిమా పూర్తి చేశాను. ఈ విషయం దర్శకుడు శంకర్ దృష్టికి కూడా వెళ్ళింది. అనేక మంది ఆశ్చర్యంగా ఆరా తీశారు. నిజం చెప్పాలంటే సినిమా షూటింగ్ ప్రారంభించేటపుడు కూడా ఇంతలా వెయిట్ చేయలేదు. కానీ, చిన్న పాత్రల్లో నటించిన వారే పెద్దయ్యాక కూడా నటించాలన్న ఉద్దేశంతో ఎదురుచూశాం. అలాంటి సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు కృతఙ్ఞతలు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు.
Also Read : Naga Chaitanya: నిశ్చితార్థం అయిన కొన్ని గంటలకే కళ్యాణమండపంలో ప్రత్యక్షం అయిన నాగ చైతన్య !