Music Master AR Rahman : అనిరుధ్ పై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

మ్యూజిక్ బాగుంది కానీ ..ఓ స‌ల‌హా

AR Rahman : భార‌తీయ సినీ సంగీత ద‌ర్శ‌కుల‌లో ఎన్న‌ద‌గిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అల్లా ర‌ఖా రెహ‌మాన్(AR Rahman). త‌ను మ‌ణిర‌త్నం రోజా మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు సంగీతం అందించాడు. మ‌రిచి పోని పాట‌ల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు. అత్యున్న‌త‌మైన ఆస్కార్ పుర‌స్కారం అందుకున్నాడు. ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ సంగీత ద‌ర్శ‌కుడుగా గుర్తింపు పొందాడు.

AR Rahman Appreciates

తాజాగా త‌మిళ సినీ రంగానికి చెందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌ను ఇటీవ‌ల మంచి సంగీతాన్ని అందిస్తున్నాడ‌ని కితాబు ఇచ్చాడు. ఇదే స‌మ‌యంలో కొంత జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించాడు ఏఆర్ రెహ‌మాన్.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌లు విన్నాను. చాలా బాగున్నాయి. కానీ కొన్ని పాట‌లు పాత పాట‌ల‌నే గుర్తుకు వ‌చ్చేలా చేస్తున్నాయ‌ని అన్నారు. పాట‌లు క్లాసిక‌ల్ వెర్ష‌న్ క‌లిగి ఉండేలా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించాడు ఏఆర్ రెహ‌మాన్. ఇలా సాంగ్స్ రూపొందించిన‌ట్ల‌యితే ఎక్కువ కాలం గుర్తుండి పోతాయ‌ని స్ప‌ష్టం చేశాడు.

ప‌రిశ్ర‌మ‌లోని కొంత‌మంది ప్ర‌ముఖుల‌తో క‌లిసి ప‌ని చేసినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ , ఇండియ‌న్ 2 లో ప‌ని చేశారు. ధ‌నుష్ తో క‌లిసి ఎథిర్ నీచ‌ల్ , తిరుచిత్రంబ‌లంకు సంగీతం అందించారు. 2023లో బాద్ షా షారుక్ ఖాన్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ జ‌వాన్ కు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం ఇచ్చాడు.

Also Read : Glamorous Pragya : బాల‌య్య‌తో న‌టించ‌డం అదృష్టం

Anirudh RavichanderAppreciationAR RahmanCommentsMusic DirectorTrending
Comments (0)
Add Comment