AR Rahman Concert : రెహ‌మాన్ సంగీత క‌చేరిలో అప‌శ్రుతి

మేనేజ్మెంట్ నిర్వాకం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

AR Rahman Concert : చెన్నై – గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా (ఏఆర్) ర‌హ‌మాన్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. చెన్నై వేదిక‌గా ఆదివారం సంగీత క‌చేరి నిర్వ‌హించారు . నిర్వాహ‌కులు సీటింగ్ కెపాసిటీకి మించి పెద్ద ఎత్తున టికెట్లు విక్ర‌యించారు.

AR Rahman Concert Viral

వేలాది మంది క‌చేరి స్థ‌లానికి చేరుకున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీత క‌చేరి నిర్వ‌హిస్తుండ‌గానే తోపులాట‌, గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. చాలా మంది అల్లా ర‌ఖా(AR Rahman) మ్యూజిక్ చేసే మ్యాజిక్ ను ద‌గ్గ‌రుండి చూసి త‌రిద్దామ‌ని అనుకున్న వాళ్ల‌కు వింత అనుభ‌వం చోటు చేసుకుంది.

చాలా మంది యువ‌తులు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గుర‌య్యారు. ఈ ఈవెంట్ నిర్వ‌హించిన యాజ‌మాన్యం స‌రిగా నిర్వ‌హించ లేద‌ని, దీనికి ఏఆర్ రెహ‌మాన్ బాధ్య‌త వ‌హించాలంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. చాలా మంది ఆవేద‌న చెందారు. ఒక్కో టికెట్ రూ 5 వేలు పెట్టి క‌చేరికి వెళితే చివ‌ర‌కు త‌మ‌ను లోప‌ల‌కు కూడా రానీయ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అభిమానులు. ప‌రిమిత సంఖ్య‌లో సీట్లు ఉంటే ఎక్కువగా టికెట్లు అమ్మార‌ని, డ‌బ్బులు చేసుకున్నారంటూ ఆరోపించారు.

సంగీత క‌చేరిని నిర్వ‌హించిన ఏసీటీసీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వాపోయారు. ఈ క‌చేరి కార్య‌క్ర‌మానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు ఏఆర్ రెహ‌మాన్.

Also Read : Fighter Movie : శ‌ర‌వేగంగా ఫైట‌ర్ మూవీ షూటింగ్

Comments (0)
Add Comment