AR Rahman : నేషనల్ క్రష్ రష్మిక మందన్న విక్కీ కౌశల్ కలిసి నటించిన చిత్రం ఛావా. ఈ మూవీకి సంబంధించి అప్ డేట్స్ వస్తున్నాయి. లవర్స్ డే ఫిబ్రవరి 14న ఛావా మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ అల్లా రఖా రెహమాన్(AR Rahman) సంగీతం అందించారు. ఇందుకు సంబంధించిన సంగీతం, పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
AR Rahman Chava Movie Song
ఇది చారిత్రాత్మకమైన కథను భారీ ఖర్చుతో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. దినేష్ విజన్ ఛావాను నిర్మించారు. మరాఠా మహా యోధుడిగా పేరు పొందిన ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోషించగా, తన భార్యగా ఏసు బాయిగా రష్మిక మందన్న అద్బుతంగా నటించారు.
ఛావా సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సింగిల్స్, సాంగ్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. తాజాగా జానే తూ అనే పాటను రిలీజ్ చేశారు. ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఏకంగా 36 మిలియన్లకు పైగా వ్యూస్ తో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Sankranthiki Vasthunam Victory : రూ. 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ మామ