Hero Salmaan-Murugadoss :ఆ మూవీ పైనే మురుగదాస్ ఫోక‌స్ 

సికింద‌ర్ త‌న‌కు బ్రేక్ ఇస్తుందా 

Murugadoss : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ మురుగదాస్(Murugadoss) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను తీసే ప్ర‌తి మూవీకి ఓ స్పెషాలిటీ ఉంటుంది. అంత‌ర్లీనంగా ఓ సామాజిక సందేశం దాగి ఉంటుంది. త‌ను తీసిన గ‌జిని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ తో స‌ర్కార్ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కోట్లు కుమ్మ‌రించింది.

Murugadoss Focus..

భార‌తీయ ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ గురించి నిగ్గ‌దీసి ప్ర‌శ్నించాడు. ఇదే పేరుతో రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు హిందీలో స‌ర్కార్ పేరుతో. ఇందులో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ , త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించారు. ప్రాణం పోశారు. ఇది కూడా బిగ్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ ను షేక్ చేసింది.

ఆ త‌ర్వాత తెలుగులో ప్రిన్స్ మ‌హేష్ బాబుతో మూవీ తీశాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. కానీ ఇది అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ ఇచ్చాడు. త‌ను త‌మిళంలో తీసి హిట్ గా నిలిచిన గ‌జినిని హిందీలో త‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించి అమీర్ ఖాన్ తో తీశాడు. ఇది సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

తాజాగా కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తో సికింద‌ర్ పేరుతో మూవీ తీస్తున్నాడు. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ కు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. త్వ‌ర‌లోనే పూర్తి చేసి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్.

Also Read : Samantha Shocking : డేటింగ్ చేసేంత స‌మ‌యం లేదు

AR MurugadossSalman KhanSikandarUpdatesViral
Comments (0)
Add Comment