Salmaan : పాన్ ఇండియా డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను గజిని తీశాడు అమీర్ ఖాన్ తో. ఇక తమిళంలో తను దళపతి విజయ్ తో తీసిన కత్తి, సర్కార్ సినిమాలు దుమ్ము రేపాయి. మహేష్ బాబుతో తీసిన మూవీ ఆశించిన మేర ఆడలేదు. ఈ తరుణంలో తాజాగా చాన్నాళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్ లో హిందీ మూవీ తీస్తున్నాడు.
Salmaan Khan AR Murugadas Sikinder
ఈ సినిమాకు సికందర్ అని పేరు పెట్టాడు. షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నాడు ఏఆర్ మురుగదాస్. ఇందులో ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ కండల వీరుడిగా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్(Salmaan) తో పాటు ఇండియన్ క్రష్ గా పేరొందిన లవ్లీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.
కథ , స్క్రీన్ ప్లే మురుగదాస్ నిర్వహిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి సికందర్ మూవీపై. యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ తో పాటు సామాజిక అంశాన్ని ఎలివేట్ చేస్తూ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. తను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉండేలా జాగ్రత్త పడతాడు. ప్రత్యేకించి సర్కార్ పేరుతో ఇప్పటికే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హిందీలో తీశాడు. ఇందులో తండ్రీ కొడుకులు అమితాబ్, అభిషేక్ బచ్చన్ నటించారు.
అయితే ఇదే సర్కార్ పేరుతో తమిళంలో సూపర్ సినిమా తీశాడు ఏఆర్ మురుగదాస్. ఇందులో దళపతి విజయ్ కీలక పాత్ర పోషించాడు.
Also Read : Union Budget 2025- Good News : రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్