Popular Director Murugadas :సెప్టెంబ‌ర్ లో రానున్న మ‌ద‌రాసి 

మురుగ‌దాస్..శివ కార్తికేయ‌న్ చిత్రం 

Murugadas : త‌మిళ సినీ రంగంలో వెరీ స్పెష‌ల్ ఏఆర్ మురుగ‌దాస్(Murugadas). త‌ను ద‌ళ‌పతి విజ‌య్ తో తీసిన స‌ర్కార్ సెన్సేష‌న్  క్రియేట్ చేసింది. అంతే కాదు అమీర్ ఖాన్ తో తీసిన గ‌జిని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. త‌న మేకింగ్ , టేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న స‌ల్మాన్ ఖాన్ తో సికింద‌ర్ తీశాడు. ఇందులో కీ రోల్ పోషించింది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా పోషించింది. అయినా త‌న ఇమేజ్ కు ఏమాత్రం డ్యామేజ్ క‌ల‌గ‌లేదు.

AR Murugadas Madharasi Movie Release Updates

ప్ర‌స్తుతం త‌మిళ సినిమా మద‌రాసి పేరుతో సినిమా తీస్తున్నాడు. షూటింగ్ కూడా బిజీగా కొన‌సాగుతోంది. ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు న‌టుడు శివ కార్తికేయ‌న్. ఈ చిత్రానికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ముందే టైటిల్ ఖ‌రారు చేశాడు. ఆ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా మురుగ‌దాస్ మాట్లాడుతూ ఇది గ‌జినిని పోలి ఉంటుంద‌ని పేర్కొన్నాడు.

ఇక ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సికంద‌ర్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. మ‌ద‌రాసిలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ కాగా , రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌తి నాయ‌కుడిగా విద్యుత్ జామ్వాల్ తో పాటు విక్రాంత్ , ష‌బ్బీర్ , బీజూ మీన‌న్ ఇత‌ర పాత్ర‌లు పోషించారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ చేయాల‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ పూర్త‌యిన‌ట్లు టాక్. ఈ సినిమాను సీరియ‌స్ గా  తీసుకున్నారు ఏఆర్ మురుగ‌దాస్.

Also Read : Hero Ram Charan-Campa :కాంపా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చెర్రీ
AR MurugadossCinemaUpdatesViral
Comments (0)
Add Comment