Sikandar : తమిళ సినీ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో సికందర్(Sikandar) మూవీ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వస్తోంది.
AR Murugadas-Sikandar
ఈ సందర్బంగా డైరెక్టర్ మురుగదాస్ చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సల్మాన్ ఖాన్ అద్భుతమైన నటుడని కితాబు ఇచ్చారు. తను డైరెక్టర్స్ హీరో అంటూ పేర్కొన్నాడు. ఈసారి తనకు బిగ్ హిట్ రావడం ఖాయమన్నారు. సికిందర్ మూవీతో తన సినీ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచి పోవడం పక్కా అని స్పష్టం చేశారు ఏఆర్ మురుగదాస్.
మరో వైపు రష్మిక మందన్నకు కెరీర్ పరంగా గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా ఫుల్ హిట్స్ వచ్చాయి. గత ఏడాది వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బన్నీతో కలిసి నటించిన పుష్ప-2 దేశ చరిత్రలో కలెక్షన్ల పరంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక తాజాగా విక్కీ కౌశల్ తో కలిసి నటించిన చావా చిత్రం సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సికిందర్ టీజర్ పై. ఈ మూవీ విజయం సాధించడం ఖాయమంటోంది.
Also Read : Popular Actress Sushmita Sen :సరైన వరుడి కోసం వేచి చూస్తున్నా
Murugadas-Sikandar Success :సికిందర్ సక్సెస్ ఖాయం
దర్శకుడు ఏఆర్ మురుగదాస్