Beauty Aparna Balamurali :ఫోర్బ్స్ ఇండియా జాబితాలో అప‌ర్ణ బాల‌ముర‌ళి

ఇండియా 30 అండ‌ర్ 30 లో ద‌క్షిణాది న‌టికి చోటు

Aparna Balamurali : ద‌క్షిణాదిలో పేరు పొందిన సినీ స్టార్స్ ఎంద‌రో ఉన్నారు. వారిలో ప్ర‌ధానంగా వినిపించే పేర్లు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, స‌మంత రుత్ ప్ర‌భు, నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి, ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌, సెక్సీ క్వీన్ పూజా హెగ్డే , లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఉన్నా వారందరిని తోసిరాజ‌ని ద‌క్షిణాది సినీ తార అప‌ర్ణ బాల‌మురళి(Aparna Balamurali) చోటు ద‌క్కించుకుంది.

Aparna Balamurali- Forbes India List

ఏ ఏడాది 2025కి సంబంధించి ఫోర్బ్స్ 30 అండ‌ర్ 30 జాబితాను తాజాగా ప్ర‌క‌టించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. సినీ తార‌లు త‌ళుక్కుమ‌న్నా ఊహించ‌ని రీతిలో అప‌ర్ణకు ఛాన్స్ ద‌క్క‌డం సినీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాయి.

ఫోర్బ్స్ ప‌త్రిక ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందింది. ఇందులో చోటు ద‌క్కాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఊహించ‌ని రీతిలో త‌న‌కు స్థానం ల‌భించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసింది. మ‌రో వైపు అప‌ర్ణ బాల‌మురళితో పాటు బాలీవుడ్ నటుడు రోహిత్ సరాఫ్ కూడా అదే విభాగంలో చోటు సంపాదించాడు.

ఇదిలా ఉండ‌గా గత సంవత్సరం సినీ న‌టుల‌కు సంబంధించి హీరోలు, హీరోయిన్ల‌కు పెరుగుతున్న జ‌నాద‌ర‌ణ‌ను ఆధారంగా చేసుకుని వీరిని ఎంపిక చేశారు. కాగా గ‌త ఏడాది 2024లో ప్ర‌ముఖ న‌టుడు ధ‌నుష్ తో క‌లిసి రాయ‌న్ చిత్రంలో న‌టించింది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.

Also Read : RBI Shocking : న్యూ ఇండియా కో ఆప‌రేటివ్ బ్యాంక్ కు షాక్

Aparna BalamuraliTrendingUpdates
Comments (0)
Add Comment