Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...

Game Changer : రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్‌ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను రూ.600 నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్టీ ప్లెక్స్‌లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

Game Changer Ticket Prices…

ప్రస్తుతం టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే పడింది. ‘రాబోయే సినిమాల బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఉండదు’ అని ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సినిమాలపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Also Read : Janhvi Kapoor : ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

game changerHikeTicketTrendingUpdatesViral
Comments (0)
Add Comment