GV Reddy : అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. పార్టీకి గొంతుకగా ఉంటూ వచ్చిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ తో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. తను జగన్ రెడ్డి హయాంలో కీలకంగా వ్యవహరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
AP fiber Net Chairman GV Reddy Declared
న్యాయవాదిగా గుర్తింపు పొందారు జీవీ రెడ్డి(GV Reddy). జగన్ రెడ్డి ఆర్థిక అక్రమాలను బహిరంగంగా ఆధారాలతో సహా బయట పెట్టారు. ఒక రకంగా పార్టీకి తను గొంతుకగా మారారు. దీంతో తనలోని డేర్ నెస్ ను చూసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఏరికోరి ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చైర్మన్ గా నియమించారు.
దీంతో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు పొందిన జీవి రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ వైసీపీ హయాంలో అక్రమంగా నియమించబడిన 500 మందికి పైగా ఉద్యోగులను ఏక కాలంలో తొలగించారు. మరికొందరు సీనియర్లపై వేటు వేశారు. ఇదే సమయంలో తనకు ఫైబర్ నెట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సహకరించడం లేదంటూ, రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జీవీ రెడ్డి.
దీంతో సీనియర్ ఐఏఎస్ లు తనను తప్పు పట్టారు. తనపై సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు జీవీ రెడ్డికి క్లాసు పీకారు. దీంతో మనస్తాపం చెందిన జీవీ రెడ్డి చైర్మన్ తో పాటు పార్టీకి గుడ్ బై చెప్పారు.
Also Read : Hero Pawan Kalyan- HHVM Song :హరి హర వీరమల్లు ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ రిలీజ్