AP Budget 2025-26 Sensational :ఏపీ బ‌డ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్య‌త

అసెంబ్లీలో బ‌డ్జెట్ 2025-26కు ఆమోదం

AP Budget 2025 : అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం శాస‌న స‌భ‌లో 2025-26(AP Budget 2025) కు సంబంధించిన బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింది. బ‌డ్జెట్ ప్ర‌తిని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు ముందుగా అంద‌జేశారు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్ లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు(CM Chandrababu). సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేస్తామ‌న్నారు.

AP Budget 2025-26 Updates

అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశామ‌న్నారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు జ‌మ చేస్తామ‌న్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తింప చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించేలా చేస్తామ‌న్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేస్తామ‌న్నారు.

స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు త‌యారు చేశామ‌న్నారు. ఎటువంటి జాప్యం లేకుండా..కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్టులో ప్రస్తావించారు. ఈ ఏడాది లోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామ‌న్నారు.

ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్టులో వెల్లడి.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్నారు.
చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అంద‌జేస్తామ‌న్నారు సీఎం. మర మగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్నారు. నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం.వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు . టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడి. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచిన ప్రభుత్వం. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read : Jaya Prada Brother Death :జ‌య‌ప్ర‌ద సోద‌రుడు రాజ‌బాబు క‌న్నుమూత

AP Budget 2025UpdatesViral
Comments (0)
Add Comment