Devara Song : ఫ్యాన్స్ కు దేవర టీమ్ నుంచి మరో కొత్త సర్ప్రైజ్

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం, జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌. సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలో గురువారం రాత్రి దేవ‌ర(Devara) టీమ్ అంతా హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో గ్రాండ్ పార్టీ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమాలో ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి దావూది అంటూ పాట‌ను జ‌త చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎన్టీఆర్‌, జాన్సీ క‌పూర్‌ల‌పై చిత్రీక‌రించిన ఈ లిరిక‌ల్ వీడియోను సినిమా విడుద‌ల‌కు ముందే రిలీజ్ చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇద్ద‌రు పోటీపడి మరీ ఈ పాటలో చిందులు వేశారు.

Devara Song Release..

తీరా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే సినిమాలో పాట లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ తిరిగి ఆ పాట‌ను సినిమాలో క‌ల‌పాల‌ని భావించింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న అన్ని థియేట‌ర్ల‌లో ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి దావుది పాట‌ను జ‌త చేయ‌నున్నారు.

Also Read : Actor Mohanraj : సీనియర్ పాపులర్ విలన్ మోహ‌న్‌రాజ్ కన్నుమూత

CinemaDevaraTrendingUpdatesViral
Comments (0)
Add Comment