Anushka Shetty: ‘శీలవతి’ గా అనుష్క శెట్టి ?

‘శీలవతి’ గా అనుష్క శెట్టి ?

Anushka Shetty: ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘పంచాక్షరి’ సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో… సూపర్, మిర్చి, విక్రమార్కుడు, బిల్లా, యముడు, సింగం సినిమాల్లోని గ్లామర్ పాత్రల్లో… బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి భారీ బడ్జెట్ సినిమాలైనా తనదైన నటనతో అగ్రహీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. యోగా టీచర్ గా సినిమా రంగంలోనికి అడుగుపెట్టిన ఈ పొడుగు సుందరి ప్రభాస్ కు సరిజోడీగా గుర్తింపు పొందింది. సైరా నరసింహారెడ్డి తరువాత ఈ ముద్దుగుమ్మ కాస్తా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మరల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, సైజ్ జీరో సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లో అనుష్క(Anushka Shetty) ఫరవాలేదనిపించినా… తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించిన సైజ్ జీరో మాత్రం కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం మలయాళంలో “కథనార్‌” అనే సినిమా చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ… ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుందని టాలీవుడ్ వర్గాల టాక్.

Anushka Shetty New Role

ఓడిశాలో పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క(Anushka Shetty) నటిస్తోందని టాక్. ఇటీవల ఒడిస్సాలో కీలక సన్నివేశాల చిత్రీకరించిన చిత్ర యూనిట్… ఈ సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్‌ ను కూడా పరిశీలిస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారని… ఈ సినిమా ఈ ఏడాదే దక్షిణాది భాషల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాపై ఇంతవరకు చిత్ర యూనిట్ నుండి గాని, అనుష్క నుండి గాని అధికారికి ప్రకటన రాలేదు.

గమ్యం, వేదం, కంచే వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌ గా ఎదిగిన క్రిష్… ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తున్నాడు. గతంలో ఆ సినిమా షూటింగ్ జరగుతుండగానే పంజా వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే సినిమాను తెరకెక్కించారు. అయితే కొండపొలం అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. దీనితో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ గ్యాప్ లో అనుష్క సినిమాను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది.

Also Read : Love @ 65 Trailer: లేటు వయసులో లవ్ లో పడిన జయప్రద, రాజేంద్ర ప్రసాద్ !

Anushka ShettyDirector Krish
Comments (0)
Add Comment