Anurag Kashyap Shocking :హిందీ సినీ రంగం విష పూరితం

ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ కామెంట్స్

Anurag Kashyap : స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఎన్నో సందేశాత్మ‌క‌, విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తీశాడు. ప్ర‌త్యేకించి స‌మాజాన్ని ప్రభావితం చేసేలా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. తాజాగా బాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. హిందీ చ‌ల‌న చిత్ర రంగం పూర్తిగా విష పూరితంగా మారి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు అనురాగ్ క‌శ్య‌ప్. అందుకే తాను బాలీవుడ్ నుంచి దూరంగా వెళ్లి పోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పాడు. ఈ మ‌ధ్య‌నే త‌ను న‌టుడిగా మారాడు.

Anurag Kashyap Shocking Comments

క్రియేటివిటీ క‌లిగిన వారికి ఇప్పుడు స్థానం లేకుండా పోయింద‌న్నాడు. అంతా క‌మ‌ర్షియ‌ల్ గా మారి పోయింద‌ని వాపోయాడు అనురాగ్ క‌శ్య‌ప్(Anurag Kashyap). దీని వ‌ల్ల తన‌లాంటి నిబ‌ద్ద‌త క‌లిగిన ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు త‌ట్టుకోలేక‌ర‌ని, ప్ర‌త్యేకించి ఇందులో ఇముడ లేర‌ని స్ప‌ష్టం చేశాడు . ద‌ర్శ‌కుల‌ను చూడ‌డం లేద‌ని బాలీవుడ్ పూర్తిగా అంకెలు, సంఖ్య‌లు, బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌ను మాత్ర‌మే చూస్తోంద‌న్నాడు. ఎన్ని కోట్లు పెట్టాం..అంత‌కు రెట్టింపు వ‌స్తుందా లేదా అన్న కోణంలోనే చూస్తున్నార‌ని అనురాగ్ క‌శ్య‌ప్.

బాలీవుడ్ ప్ర‌స్తుతం పూర్తిగా విష పూరిత‌మై పోయింద‌న్నాడు. ఇందులో తాను ఇముడ లేన‌ని దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, ఎవ‌రు ఏమ‌ని అనుకున్నా ఇదే త‌న అంతిమ నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. ఇదిలా ఉండ‌గా అనురాగ్ క‌శ్య‌ప్ చేసిన ఈ కీల‌క ప్ర‌క‌ట‌న సినీ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది.

Also Read : Hero Priyadarshi-Court Movie :అంచ‌నాలు పెంచుతున్న కోర్ట్ మూవీ 

Anurag KashyapCommentsShockingViral
Comments (0)
Add Comment