Anupriya Goenka Shocking : ఆ హీరో కార‌ణంగా చాలా ఇబ్బంది ప‌డ్డా

బాలీవుడ్ బ్యూటీ అనుప్రియ గోయెంకా

Anupriya Goenka : బాలీవుడ్ బ్యూటీ అనుప్రియ గోయెంకా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ఓ సినిమా చేస్తున్న స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్న హీరోతో స‌న్నిహితంగా ఉండే ఓ సీన్ చేయాల్సి వ‌చ్చింది. తొలుత క్యాజువ‌ల్ గా తీసుకున్నా. దీనినే త‌ను అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఆ త‌ర్వాత సీన్ చేస్తున్న స‌మ‌య‌లో తాక‌రాని చోట తాకాడు. దీంతో తీవ్ర ఇబ్బంది ప‌డ్డాన‌ని చెప్పింది. అయితే త‌ర్వాత స‌ద‌రు హీరో అలా చేయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాన‌ని పేర్కొంది. చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టింది.

Anupriya Goenka Shocking Comments

కాగా తాజాగా అనుప్రియ గోయెంకా(Anupriya Goenka) చేసిన కామెంట్స్ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప‌ద్మావ‌తి, టైగ‌ర్ జిందా, వార్ వంటి చిత్రాల‌లో న‌టించింద త‌ను. అంతే కాకుండా ఇటీవ‌ల మ‌రో మూవీకి ఓకే చెప్పింది. త‌ను ఒక్క హీరోనే కాదు సహ న‌టులతో క‌లిసి స‌న్నివేశాల‌లో న‌టిస్తున్న‌ప్పుడు చాలా అసౌక‌ర్యంగా భావించాన‌ని ఆవేద‌న వ్యక్తం చేసింది. సినీ కెరీర్ లో రెండుసార్లు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను తాను ఎదుర్కొన్న‌ట్లు చెప్పింది అనుప్రియ గోయెంకా.

ఒక‌సారి ముద్దు పెట్టుకునే స‌న్నివేశంలో మితిమీరి ప్ర‌వ‌ర్తించ‌డం జ‌రిగింది. మ‌రో సంద‌ర్భంలో తాను సౌక‌ర్యంగా లేని దుస్తులు ధ‌రించాను. ఒక చోట ప‌ట్టుకోవాల్సిన హీరో చెప్పుకోలేని చోట తాకేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. దీనిని నేను గ్ర‌హించాను. ముందే తెలుసుకుని క‌ళ్ల‌తోనే సీరియ‌స్ గా ఎక్స్ ప్రెస్ ఇచ్చాన‌ని చెప్పింది. చాలాసార్లు ఆ హీరో నా న‌డుముపై చేతులు పెట్టాడు. అది స‌రైన‌ది కాదంటూ నేరుగా చెప్పేశాన‌ని అన్న‌ది. ముద్దు స‌న్నివేశంలో చాలా గ‌ట్టిగా పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశాడంటూ మండిప‌డింది.

Also Read : Hero Kalyan Ram Movie :18న రానున్న అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి

Anupriya GoenkaCommentsShockingViral
Comments (0)
Add Comment