Anupama Parameswaran: జానకిగా మారుతున్న అనుపమ పరమేశ్వరన్ !

జానకిగా మారుతున్న అనుపమ పరమేశ్వరన్ !

Anupama Parameswaran: ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి ముద్ర వేసుకున్న అనుపమ… ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. అయితే దిల్ రాజు మేనల్లుడు ఆశిష్‌ హీరోగా చేసిన ‘రౌడీ బాయ్స్’లో లిప్ కిస్ సీన్స్‌లో నటించి అందరూ అవాక్కయ్యేలా చేసింది. తాజాగా ‘డీజీ టిల్లు’ కు సీక్వెల్‌ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ లో కాస్తంత గ్లామర్ డోస్ పెంచి కొంతమంది అభిమానులను హర్ట్ చేస్తే… మరికొంతమంది అభిమానులకు మాత్రం అందాల విందును అందించింది.

Anupama Parameswaran Movies

‘టిల్లు స్క్వేర్‌’తో గ్లామర్‌ క్వీన్‌ గా పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran)… మలయాళంలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అనుపమ ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ నారాయణ్‌ తెరకెక్కిస్తున్న ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ట్రూత్‌ షల్‌ ఆల్‌వేస్‌ ప్రివేల్‌ అనేది ఉపశీర్షికగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ… జానకిగా కనిపించనుంది. లాయర్‌ గా ప్రముఖ నటుడు సురేశ్‌ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు పూర్తైనట్లు ఇన్‌ స్టా వేదికగా తెలుపుతూ… దర్శకుడితో ఉన్న ఫొటోను పంచుకుంది అనుపమ. ‘నా తదుపరి చిత్రానికి డబ్బింగ్‌ పూర్తైంది’ అంటూ రాసుకొచ్చింది. కోర్టు రూమ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిరణ్‌ నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే చిత్రీకరణ ముగిసింది.

Also Read : Hero Nani : హీరో నానికి ఆర్ఆర్ఆర్ నిర్మాత అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా…!

Anupama ParameswaranTillu Square
Comments (0)
Add Comment