Anupama Parameswaran: ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి ముద్ర వేసుకున్న అనుపమ… దిల్‌రాజు వారసుడు ఆశిష్ హీరోగా చేసిన ‘రౌడీ బాయ్స్’లో లిప్ కిస్ సీన్స్‌లో నటించి అందరూ అవాక్కయ్యేలా చేసింది. తాజాగా ‘డీజీ టిల్లు’ సీక్వెల్‌లోనూ కాస్తంత బోల్డుగానే నటించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన పాట ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇదేదో ఒకటో రెండు మూవీస్ విషయంలో కాదని… ఇకపై మరింత బోల్డ్ తరహా పాత్రలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ అయినా సరే నటించడానికి అనుపమ సిద్ధమైపోయిందని టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
Anupama Parameswaran – బోల్డ్ అండ్ బెడ్ రూం సీన్స్ కు ఓకే అంటున్న మలయాళ బ్యూటీ ?
ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు కూడా వచ్చే ఏడాది థియేటర్లలోనికి రాబోతున్నాయి. ఇవి కాకుండా ఆమె తమిళం, మలయాళంలో ఒక్కో సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతుండటంతో అనుపమ రూట్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అవకాశాల కోసం బోల్డ్ పాత్రలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా నటించడానికి సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా అటువంటి సీన్లు ఉన్న సినిమాకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అవకాశాల కోసం ఆమె బోల్డ్ పాత్రలకు సిద్ధం కావటం పట్ల నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Madhurapudi: రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌కి ‘మధురపూడి గ్రామం అనే నేను’