Anupama Parameswaran : మలయాళ నటుడు సురేష్ గోపి , అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్‌పై జె.ఫణీంద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (జె. ఎస్. కె). ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి ఇతర పాత్రధారులు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది.
Anupama Parameswaran Movie Updates
జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా రూపొందించారు. ఇందులో లాయర్‌గా సురేష్ గోపి గారు నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాది టిల్లు స్వ్కేర్ చిత్రంతో అలరించిన అనుపమా ప్రస్తుతం దక్షిణాదిలో ఆరు సినిమాలతో బిజీగా ఉంది.
Also Read : Inox Theatres : సినిమా నచ్చకుంటే పైసల్ రిటర్న్ చేస్తామంటున్న మల్టీప్లెక్స్ యజమానులు