Anupama : అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం పరదా టీజర్ ఆసక్తిని రేపుతోంది. ప్రవీణ్ కండ్రేగుల దీనిని సోషఙయా డ్రామా జానర్ లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది నటి. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మూవీ మేకర్స్.
Anupama Parameswaran Movie Updates
టైటిల్ కూడా మరింత ఉత్కంఠను రేకెత్తించేలా పరదా అని పేరు పెట్టారు. ఇందులో సుబ్బు అనే పాత్రలో నటిస్తోంది అనుపమ(Anupama) పరమేశ్వరన్. చచ్చేందుకు రూ. 70 లక్షలు ఇస్తోందట అంటూ టీజర్ డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. ఎవరైనా బతికేందుకు ఖర్చు పెడతారు..కానీ ఈ అమ్మాయి మాత్రం చచ్చేందుకు ఖర్చు చేస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా తీశాడు డైరెక్టర్. దర్శన్ రాజేంద్రన్, సంగీత ఇతర పాత్రల్లో నటించారు. వీరితో కలిసి అనుపమ పరమేశ్వరన్ ఓ యాత్రకు వెళుతుంది. ఒక్కో పాత్రకు ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఆద్యంతమూ అనుపమ పరదాతోనే ఉంటుంది. ఇది ఎందుకు అనేది సస్పెన్స్.
తను ఉండే ఊరులోని ఆడవాళ్లంతా పరదాలతోనే ఉంటారు. తమ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడతారు. సంప్రదాయాలు, ఆచారాలు, మూఢ నమ్మకాలతో సినిమా తిరుగుతుంది. మొత్తంగా సుబ్బు పాత్రలో అనుపమ యాక్షన్ బాగుంది. సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే తెలుస్తుంది పరదా వెనుక ఉన్న కథేంటి అని.
Also Read : Beauty Rashmika : ఆ పాత్ర దక్కడం దేవుడిచ్చిన వరం