Anupama : నటి అనుపమ పరమేశ్వరన్ సంచలనంగా మారింది. తను ధ్రువ్ విక్రమ్ తో డేటింగ్ చేస్తున్నట్లు కన్ ఫర్మ్ అయ్యింది. ఇద్దరికి సంబంధించిన ప్రైవేట్ (వ్యక్తిగత) ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక అనుపమ(Anupama) ప్రస్తుతం బిజీగా ఉంది. తను తమిళం, తెలుగు, మలయాళం భాషలకు సంబంధించిన మూవీస్ లో నటిస్తోంది. ఇటీవల తను కీ రోల్ పోషించిన తమిళ, తెలుగు మూవీ డ్రాగన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై వసూళ్లలో సంచలనం సృష్టించింది.
Anupama Parameswaran Dating with..
తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ఏకంగా రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో సంతోషంగా ఉంది అనుపమ పరమేశ్వరన్. డ్రాగన్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహర్ తో పాటు అనుపమ ముఖ్య భూమిక పోషించారు. శర్వానంద్ తో కలిసి సతీష్ తీసిన శతమానం భవతి చిత్రంలో నటించింది. ఇది తనను తెలుగు వారికి మరింత దగ్గరయ్యేలా చేసింది. అంతే కాకుండా జొన్నలగడ్డ సిద్దూతో కలిసి టిల్లు స్క్వేర్ లో నటించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇందులో అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాల తర్వాత అనుపమ పరమేశ్వరన్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన పరదాలో కీ రోల్ పోషించింది. ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోషన్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి తన బాయ్ ఫ్రెండ్ ధ్రువ్ విక్రమ్ తో కలిసి చెట్టా పట్టాల్ వేసుకుని తిరగడం వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరి ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. పూర్తిగా పీకల లోతు ప్రేమలో కూరుకు పోయిన అనుపమ పెదవులపై ముద్దు పెట్టుకోవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Anchor Ravi Shocking :హిందూ సంఘాల ఆందోళన యాంకర్ ఆవేదన