Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్(Anupam Kher) ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన పాత్ర పోషిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానులను ఎంతగానో అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు.
‘హరి హర వీరమల్లు’ చిత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జ్యోతి కృష్ణ ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రత్యేక టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో, రెట్టింపు ఉత్సాహంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hari Hara Veera Mallu Movie Updates
ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఈ చిత్రం యొక్క మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేయడం కోసం సాంకేతికత బృందంలో చేరారు. లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి మరియు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి దిగ్గజాలు ఈ అద్భుత చిత్రం కోసం పని చేస్తున్నారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన భాగం చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు ప్రారంభించారు. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ” హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్” త్వరలో విడుదల కానుంది. మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read : Allu Arjun-Wayanad : వాయనాడ్ బాధితులకు 25 లక్షలు విరాళం ప్రకటించిన బన్నీ