Beauty Anshu Ambani :తాను మ‌ళ్లీ న‌టిస్తాన‌ని అనుకోలేదు

మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు కామెంట్

Anshu Ambani : అక్కినేని నాగార్జున‌తో మన్మ‌థుడులో న‌టించి మ‌న‌సు దోచుకున్న ముద్దుగుమ్మ అన్షు(Anshu Ambani) ఉన్న‌ట్టుండి 20 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత త‌ళుక్కున మెరిసింది. వ‌చ్చిన వెంట‌నే ఉన్న‌ట్టుండి త‌న‌పై ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీంతో రిలీజ్ కాకుండా మ‌జాకా మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి.

Anshu Ambani Comment

ఇప్పుడు సినిమాలో ఓ ట్రెండ్ న‌డుస్తోంది. సినిమాకు, న‌టీ న‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించి నెగ‌టివ్ ప్రచారం ఎక్కువ‌గా ఉంటోంది. ఎంత ఎక్కువ‌గా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తే అంత‌గా పాపుల‌ర్ అవుతామ‌నే ధోర‌ణి నెల‌కొంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి అన్షు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

తన‌కు పాత్ర న‌చ్చితేనే న‌టిస్తాన‌ని ముందుగానే ఫిక్స్ అయ్యాన‌ని, అందుకే ఎక్కువ కాలం ఇక్క‌డ ఉండ‌లేక పోయాన‌ని చెప్పింది. రావు ర‌మేష్‌, సందీప్ కిష‌న్, రీతూ వ‌ర్మతో క‌లిసి అన్షు కూడా తెర పంచుకుంది. ఈ సినిమా ట్రైల‌ర్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. అంతే కాదు ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. తండ్రీ కొడుకులుగా రావు ర‌మేష్, సందీప్ కిష‌న్ న‌టించారు. ఇద్ద‌రూ వేరే వాళ్ల‌తో ల‌వ్ లో ప‌డ‌టం ఇందులో ప్ర‌త్యేక‌త‌.

రావు ర‌మేష్ కు అన్షు , సందీప్ కిష‌న్ కు రీతు వ‌ర్మ కాంబోలో సినిమాను న‌వ్వుల న‌జ‌రానాగా ఉండేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. ఈనెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఈ సంద‌ర్బంగా అన్షు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. చాలా కాలం త‌ర్వాత సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పింది. ఈ పాత్ర త‌న‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేస్తుంద‌ని తెలిపింది.

Also Read : Hero Sundeep Kishan Mazaka : ‘మ‌జాకా’ కెవ్వు కేక‌ న‌వ్వించ‌డం ప‌క్కా

Anshu AmbaniCinemaCommentsMazakaViral
Comments (0)
Add Comment