Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్

బాలకృష్ణ చివరి సినిమాలు అఖండ, భగవంత్ కేసరిలలో చిన్నపాప పాత్ర ఎంతో కీలకంగా వ్యవహరించిందో తెలిసిందే...

Daaku Maharaaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ద్వారా ఇదొక బంధిపోట్లకు సంబంధించిన యాక్షన్ డ్రామాగా తెలుస్తోంది. ఇందులో నలుగురు హీరోయిన్లు ఉండగా ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేది క్లారిటీ లేదు.

Daaku Maharaaj Movie Updates

బాలకృష్ణ చివరి సినిమాలు అఖండ, భగవంత్ కేసరిలలో చిన్నపాప పాత్ర ఎంతో కీలకంగా వ్యవహరించిందో తెలిసిందే. అయితే డాకులో కూడా ఓ చిన్న పాప పాత్ర కూడా కీలకం అన్నట్లు సితార హింట్స్ ఇస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. 23న చిన్ని అనే స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ పాత్రలో నాలుగు హీరోయిన్లలో ఎవరో ఒకరు కనిపించనున్నారు. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్ ప్రధాన పాత్రలు పోషించినట్లు కనిపిస్తుంది. ఇలా రెండు ఫ్యామిలీ స్టిల్స్ వదిలిన తరువాత మళ్లీ ఓ మాస్ స్టిల్ కూడా వదిలారు మేకర్స్. ఈ స్టిల్ లో బాలయ్య ఓ రగ్డ్ జీప్ ను డ్రైవ్ చేస్తు యాక్షన్ మోడ్ లో కనిపించారు.

ఈసినిమాలో అద్భుతమైన విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం ఇలా ప్రతిదీ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నట్లు, టీజర్‌తోనే వాగ్దానం చేశారు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. సంచలన స్వరకర్త ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Also Read : Rashmika Mandanna : వైరల్ అవుతున్న రష్మిక ఓ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు

CinemaDaaku MaharaajTrendingUpdatesViral
Comments (0)
Add Comment