Bellamkonda Srinu : పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ హీరో ‘బెల్లంకొండ శ్రీనివాస్’

'అల్లుడు శీను' సినిమాతో తెరంగ్రేటం చేసిన యాక్షన్ హీరో 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్'...

Bellamkonda Srinu : ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లి భాజాలు గట్టిగా మోగుతున్నాయి. నేడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒకటి కానుండగా మరో స్టార్ హీరో పెళ్లి కొడుకు కావడానికి సిద్దమయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ ని ఏలిన ఓ తరం హీరోయిన్లందరితో నటించిన ఆయన బాలీవుడ్ లోను తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ఓ నియో-నోయిర్‌ యాక్షన్‌ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Bellamkonda Srinu Marriage..

‘అల్లుడు శీను’ సినిమాతో తెరంగ్రేటం చేసిన యాక్షన్ హీరో ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinu)’. ప్రస్తుతం నియో-నోయిర్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత, శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పెద్దబ్బాయి లైఫ్ సెట్ అయిపోయింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఏప్రిల్ లో నేను ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరమే ఉండొచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే. త్వరలేనే ప్రకటిస్తాము. చిన్న అబ్బాయి కెరీర్ ఇంకా సెట్ కావాలి. ఆ తర్వాత పెళ్లి ‘ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరోవైపుబెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పత్రాలు పోషిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

Also Read : Daaku Maharaaj : బాలయ్య నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి కీలక అప్డేట్

Bellamkonda Sai SrinivasmarriageTrendingUpdatesViral
Comments (0)
Add Comment