Posani Krishna Murali : ప్రముఖ వివాదాస్పద నటుడు పోసాని కృష్ణ మురళికి మరో సారి షాక్ తగిలింది. సూళ్లూరు పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉన్నట్టుండి బెయిల్ పై విడుదలైన ఆయనకు ఉన్నట్టుండి ఝలక్ ఇవ్వడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయనపై పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు వచ్చి సంతకం చేశారు.
Posani Krishna Murali Shocking
ఈ సమయంలోనే సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు స్వయంగా పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి అందజేశారు. కోర్టు ఆదేశించిన మేరకు ఇచ్చామన్నారు. గతంలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆయనను అడ్డం పెట్టుకుని పోసాని కృష్ణ మురళి రెచ్చి పోయారు. అనరాని మాటలు అన్నారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఇదే రీతిన కామెంట్స్ చేయక పోయినా ఎక్స్ వేదికగా ఏకి పారేశాడు. ఆపై వ్యూహం అనే పేరుతో సినిమా కూడా తీశాడు. ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను ఉద్దేశించి వ్యంగ్యంగా పాత్రలు సృష్టించాడు.
ఇదే సమయంలో పోసాని కృష్ణ మురళి ఆ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఏపీలో వైసీపీ సర్కార్ కూలి పోయింది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కూటమి సర్కార్ కొలువు తీరింది. ఆ తర్వాత రెడ్ బుక్ అమలవుతోంది. ఈ పరిణామాల మధ్య పోసానికి చుక్కలు చూపించారు పోలీసులు. పలు పోలీస్ స్టేషన్లను తిప్పారు. పలు కేసులు నమోదు చేశారు. వివిధ జైళ్లల్లో ఆయన రిమాండ్ ఖైదీగా కొంత కాలం కూడా గడిపారు. గత నెలలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉన్నట్టుండి నోటీసులు అందుకోవడం షాక్ తెప్పించింది.
Also Read : Sumaya Reddy Shocking :మాట్లాడితేనే సంబంధం అంటగడితే ఎలా..?