SSMB29 : ఒక్క అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా.. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ఎప్పుడు ట్రెండింగ్‌లోనే కనిపిస్తోంది.ట్రిపులార్ తరువాత గ్లోబల్ రేంజ్‌ను టార్గెట్ చేసిన జక్కన్న మహేష్ మూవీ కోసం ఆ రేంజ్ కాన్వాస్‌ను రెడీ చేస్తున్నారు. అందుకే గ్లోబల్ రేంజ్‌లో వినిపిస్తున్నాయి ఎస్ఎస్ఎంబీ 29(SSMB29) ట్రెండ్స్. ట్రిపులార్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న జక్కన్న, వెంటనే మహేష్(Mahesh Babu) మూవీ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ కోసం ఏకంగా మూడేళ్ల టైమ్ తీసుకొని గ్లోబల్ రేంజ్ కంటెంట్‌ను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
SSMB29 Movie Updates
అయితే అఫీషియల్‌గా జక్కన్న సైడ్ నుంచి ఒక్క అప్‌డేట్ కూడా లేకపోయినా.. ఈ సినిమాకు సంబంధించిన ట్రెండ్స్ మాత్రం రెగ్యులర్‌గా కనిపిస్తున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో జక్కన్న ప్లానింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందన్న న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్‌కు జోడీగా హాలీవుడ్‌ను రూల్ చేస్తున్న ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించబోతున్నారన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్. ఎస్ఎస్ఎంబీ 29ను గ్లోబల్ మూవీగా డిజైన్ చేస్తున్న జక్కన్న కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్‌వర్త్‌ను తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారట.
థార్,అవెంజర్స్ సీరిస్‌లతో ఇండియన్ ఆడియన్స్‌కు కూడా దగ్గరైన క్రిస్, మహేష్ మూవీలో నటిస్తే సినిమాకు వెస్ట్రన్ మార్కెట్‌లో హెల్ప్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టిస్ట్‌లు మాత్రమే కాదు. టెక్నీషియన్స్ కోసం కూడా హాలీవుడ్ తలుపు తడుతున్నారట జక్కన్న. యాక్షన్, స్టంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హాలీవుడ్ టెక్నిషియన్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read : Vijay Deverakonda : తన లవ్ రిలేషన్ పై స్పందించిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ