Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ ‘షారుఖ్ ఖాన్’ కేసులో మరో కొత్త ట్విస్ట్

ఈకాల్ చేసింది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కి చెందిన ఫైజాన్‌గా గుర్తించారు...

Shah Rukh Khan : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబైలో హై అలర్ట్ ఏర్పడింది. ఇప్పటికే స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌కి పలు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయినా పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు కొందరు షారుఖ్‌(Shah Rukh Khan)ని టార్గెట్ చేశారు. ఇటీవల పోలీసులకే డైరెక్ట్ కాల్ చేసి షారుఖ్ ని చంపేస్తాం అని బెదిరించారు. రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. అయితే ఈ కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

Shah Rukh Khan Case Updates

ఈకాల్ చేసింది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కి చెందిన ఫైజాన్‌గా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా లాయర్. దీంతో పోలీసులు అతని పట్టుకోవడానికి రాయ్‌పూర్ బయలుదేరారు. తాజాగా ఫైజాన్‌‌ని రాయ్‌పూర్ లోని తన ఇంటివద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిపై బాంద్రా పోలీసులు భార‌త న్యాయ సంహిత‌లోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసును న‌మోదు చేశారు.

మరోవైపుబిష్ణోయ్ గ్యాంగ్ అంటూ.. సల్మాన్, షారుఖ్ ని బెదిరిస్తూ పోలీసులకు ఫేక్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఇటీవల సల్మాన్ ఖాన్‌ని సపోర్ట్ చేస్తూ ఒక గేయ రచయిత పాట రాశారు. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ పేరును కూడా ప్రస్తావించడంతో కొందరు ముంబై ట్రాఫిక్ పోలీసులకు కాల్ చేశారు. ఆ పాట రాసిన గేయ రచయిత నెల రోజుల్లో దారుణమైన పరిస్థితి ఎదురుకోవాల్సిందని, ముందులాగ రచనలు చేయలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక సల్మాన్‌కి దమ్ముంటే సదురు రచయితకి ఎం కాకుండా కాపాడుకోవాలిని ఛాలెంజ్ విసిరారు.

Also Read : Mr Bachchan Producer : మిస్టర్ బచ్చన్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

BreakingLawrence BishnoiPolice CaseShah Rukh KhanUpdatesViral
Comments (0)
Add Comment