Ram Gopal Varma Case Shocking :రామ్ గోపాల్ వర్మపై మరో ఫిర్యాదు

చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి

Ram Gopal Varma : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. మత ఉగ్రవాద చర్యలను వర్మ ప్రేరేపిస్తున్నాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్ వ్య‌వ‌స్థాప‌క ప్రెసిడెంట్ మేడా శ్రీ‌నివాస్ సార‌థ్యంలో బుధ‌వారం రాజ‌మండ్రి 3వ టౌన్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వర్మపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.

Ram Gopal Varma Got Another Case Shocking

త‌న‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టును ఆశ్ర‌యించారు వ‌ర్మ‌. ఇదిలా ఉండ‌గా గ‌త వైసీపీ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో రామ్ గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma) ప్ర‌స్తుత సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ ల‌ను ఏకి  పారేశారు.వ్యూహం పేరుతో సినిమా కూడా రూపొందించారు. ఇందులో పాత్ర‌ల ద్వారా వారి వ్య‌క్తిత్వానికి సంబంధించి డ్యామేజ్ చేసేలా చిత్రీక‌రించారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలోని ప‌లు చోట్ల రామ్ గోపాల్ వ‌ర్మపై పోలీస్ స్టేష‌న్ ల‌లో కేసులు న‌మోద‌య్యాయి.

కామెంట్స్ విష‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది రామ్ గోపాల్ వ‌ర్మ‌కు. ఆయ‌నను అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ సీఐడీ పోలీసుల‌ను ఆదేశించింది. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మ‌రో ఫిర్యాదు న‌మోదు కావ‌డంతో షాక్ కు గుర‌య్యారు ఆర్జీవీ.

Also Read : Sai Abhyankkar- Sensational Music :సాయి అభ్యాంక‌ర్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా

Police CaseRam Gopal VarmaShockingUpdatesViral
Comments (0)
Add Comment