Oscar 2025 Awards : అమెరికా – ఆస్కార్ అవార్డులు 2025 సంవత్సరానికి సంబంధించి అత్యధిక పురస్కారాలను గెలుచుకుంది అనోరా చిత్రం. ఆరు ఆస్కార్ లలో ఐదు అవార్డులను ఈ చిత్రం గెలుచు కోవడం విశేషం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కు అవార్డులు దక్కాయి. రచయిత, దర్శకుడు, సంపాదకుడు సీన్ బేకర్ రికార్డు సృష్టించాడు.
Oscar 2025 Awards Winners..
ది బ్రూటలిస్ట్ మూడు అవార్డులను గెలుచుకోగా, వికెడ్, డ్యూన్ పార్ట్ టూ ఒక్కొక్కటి రెండు అవార్డులను గెలుచుకుంది. అత్యధికంగా నామినేట్ అయిన చిత్రం ఎమిలియా పెరెజ్, 13 నామినేషన్లతో, కేవలం రెండు ఆస్కార్(Oscar 2025 Awards)లను మాత్రమే గెలుచుకుంది: ఉత్తమ సహాయ నటి, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కు మాత్రమే ఎంపికైంది.
విజేతల పరంగా చూస్తే ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపిక కాగా, ఉత్తమ దర్శకుడిగా జాక్వెన్ ఆడియార్ట్ , ఉత్తమ నటిగా మైకీ మాడిసన్, ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీ, ఉత్తమ సహాయ నటిగా మోనికా బార్బరో,
ఉత్తమ సహాయ నటుడిగా అనోరా చిత్రంలో నటించిన యురా బోరిసోవ్ ఎంపికయ్యాడు. ఉత్తమ ఒరిజనల్ స్క్రీన్ ప్లే అనోరా స్టీన్ బేకర్ ఎంపికయ్యాడు. ఉత్తమ ఫ్లైడ్ స్క్రీన్ ప్లే కాంక్లేవ్ గెలుపొందారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గా ఐ యామ్ స్టిల్ హియర్ విజేతగా నిలిచింది.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ గా ఫ్లో, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ గా నో అదర్ ల్యాండ్ , బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఆర్కెస్ట్రా, ఐయామ్ నాట్ ఏ రోబోట్, బెస్ట్ యానిమిటేడె్ షార్ట్ గా సైప్రస్ , బెస్ట్ ఒరిజనల్ స్కోర్ విభాగంలో ది బ్రూటలిస్ట్ విజేతగా నిలిచింది. బెస్ట్ సాంగ్ గా మిలియా పెరెజ్ నుండి మి కామినో ఎంపికైంది. బెస్ట్ సౌండ్ విభాగంలో డ్యూన్ పార్ట్ టు, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కింద వికెడ్ విజేతగా నిలిచింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ కింద ది బ్రూటలిస్ట్ , ఉత్తమ జట్టు, అలంకరణ విభాగంలో ది సబ్ స్టెన్స్ , ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో వికెడ్ గెలుపొందింది. ఉత్తమ చలన చిత్రం ఎడిటింగ్ లో అనోరా విజేతగా నిలిచింది.
Also Read : Popular Oscar 2025 Awards:ఉత్తమ నటుడిగా బ్రాడీ ..నటిగా మాడిసన్