Annapurna Studios : సినిమా అవకాశాలిస్తామంటూ సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం

వయసు 8 నుంచి 15 మధ్యలో ఉండాలి అంటూ అమాయకులకు వల వేసే ప్రయత్నం చేశారు...

Annapurna Studios : సినిమాల్లో అవకాశాల కోసం వందల మంది ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా అంటే పిచ్చితో ఊర్లనుంచి హైదరాబాద్ వచ్చి సినిమా ఆఫిసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా సినిమాల కోసం వెతికే వారిని టార్గెట్ చేసి కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసం చేస్తూ ఉంటారు. సినిమా ఛాన్స్‌ల పేరుతో డబ్బులు వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారు. ఇలా చాలా మంది సినిమా అవకాశాల పేరుతో మోసపోయారు. మరికొంతమంది ప్రముఖ సినిమా బ్యానర్స్ పేరుతో మెయిల్స్ పంపించి అవకాశాలు ఇప్పిస్తాం అంటూ ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ మెయిల్స్ పంపించారు. దీని పై అన్నపూర్ణ స్టూడియోస్ స్పందించింది.

Annapurna Studios….

అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ సినిమా కోసం హీరో , హీరోయిన్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కావాలి అంటూ ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు సైబర్‌ నేరగాళ్లు. హీరోకు 20నుంచి 27 వయసు ఉండాలి, హీరోయిన్ పాత్రకు ముగ్గురు అమ్మాయిలు కావాలి.. వయసు 8 నుంచి 15 మధ్యలో ఉండాలి అంటూ అమాయకులకు వల వేసే ప్రయత్నం చేశారు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ ఖండించింది.

తాము ఎలాంటి ప్రకటన చేయలేదు దయ చేసి నమ్మొద్దు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios). దయచేసి ఇలాంటివి నమ్మకండి.. మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఎలాంటి ప్రకటనైనా మేము మా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటాము..లేదా మా వెబ్‌సైట్‌ ద్వారానే పంచుకుంటామని తెలిపింది. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పేరుతో కొంతమంది ఇలా ఫేక్ మెయిల్స్ పంపించారు. ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కొందరు అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేశారు.

Also Read : Nayanthara : అలాంటి వారితో వాదించడం వల్ల మీ సమయం వృధా

BreakingUpdatesViral
Comments (0)
Add Comment