Anna Konidala: సినిమాలు, రాజకీయాలు, కుటుంబం తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది కలిసొస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుండి భారీ మెజారిటీతో గెలుపొందడంతో పాటు గెలిచిన అన్ని చోట్ల విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేట్ తో రికర్డు సృష్టంచారు. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారడంతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో తన కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి గత నెలన్నర రోజులుగా ట్రెండింగ్ లో నిలుస్తున్నారు.
Anna Konidala…
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల(Anna Konidala) సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనా కొణిదెలకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించారు. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరై, తన భార్యను అభినందించారు. అనా కొణిదెల(Anna Konidala)కు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆమె సింగపూర్ యూనివర్శిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా తీసుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
అంతకు ముందు అన్నా కొణిదెల రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్‌లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అనా కొణిదెల మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి.పరాన్జీ తెరకెక్కించిన ‘తీన్‌మార్’లో అన్నా లెజినోవా యాక్ట్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల అనా లెజినోవా సింగపూర్ ట్రిప్స్ పై కొందరు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్ చేసిన వారందరికీ… ఈ మాస్టర్స్ డిగ్రీతో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మరియు అనా.
Also Read : Ranveer Singh: త్వరలో సెట్స్ పైకి రణ్ వీర్ సింగ్ ‘ధురంధర్’ !