Game Changer Big Shock : గేమ్ ఛేంజ‌ర్ బిగ్ షాక్

ఓపెన్ అయిన అంజ‌లి

Game Changer : స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చ‌ర‌ణ్ , ల‌వ్లీ బ్యూటీ కియారా అద్వానీ క‌లిసి న‌టించిన గేమ్ ఛేంజ‌ర్(Game Changer) పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది మ‌రో కీ రోల్ పోషించిన న‌టి అంజ‌లి. త‌న జీవితంలో మ‌రిచి పోలేని పాత్ర త‌న‌కు డైరెక్ట‌ర్ ఇచ్చార‌ని, దానికి వంద శాతానికి పైగా న్యాయం చేశాన‌ని చెప్పింది. కానీ ఊహించ‌ని రీతిలో మూవీ బోల్తా ప‌డ‌డం త‌న‌తో పాటు న‌టించిన వారిని కూడా విస్తు పోయేలా చేసింద‌ని పేర్కొంది.

Game Changer Movie Shock..

న‌టించ‌డం వ‌ర‌కే తాము చూసుకుంటామ‌ని, ఆ త‌ర్వాత ఆద‌రించ‌డం అనేది ప్రేక్ష‌కుల చేతుల్లో ఉంటుంద‌ని వేదాంత ధోర‌ణి వ్య‌క్తం చేసింది అంజ‌లి. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. భార‌త దేశంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరొందిన శంక‌ర్ నుంచి మూవీ రావ‌డంతో అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూశారు.

వ‌ర‌ల్డ్ వైడ్ గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేశారు గేమ్ ఛేంజ‌ర్ మూవీని. కానీ విడుద‌లైన రోజు నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నిర్మాత‌కు కోలుకోలేని దెబ్బ ప‌డింది. లాక్ చేసిన చాలా థియేట‌ర్ల‌న్నీ ఖాళీగా ద‌ర్శ‌నం ఇచ్చాయి.

మెగా ఫ్యామిలీకి ఈ మూవీ తీవ్ర నిరాశ‌ను మిగిలించింది. త‌మ స్టార్ డ‌మ్ ఏమీ ప‌ని చేయ‌లేద‌ని తేలి పోయింది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆచార్య మూవీ కూడా చిరంజీవి, చెర్రీ క‌లిసి న‌టించారు. త‌మ పేరుతోనే మూవీ స‌క్సెస్ అవుతుంద‌ని భావించారు. కానీ జ‌నం ఛీ కొట్టారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, చెర్రీ ఇలా ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌మోష‌న్స్ చేసినా గేమ్ చేంజ‌ర్ బోల్తా ప‌డింది. ఈ మూవీ ఆడ‌క పోవ‌డంపై న‌టి అంజ‌లి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : Beauty Deepika Padukone : ఆ మూవీ పైనే దీపికా ప‌దుకొనే ఫోక‌స్

anjaliCommentsIndian ActressShockingViral
Comments (0)
Add Comment