Anjali: టాలీవుడ్ లో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది. దీనితో బ్యాచ్ లర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సీనియర్ నటీనటులు ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ల పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 39 ఏళ్ల వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధపడటంతో… ఆ తరువాత జాబితాలో ఉన్న 36 ఏళ్ళ అంజలి(Anjali) పెళ్లిపై కూడా పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంజలి మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు ఆమెని వెంటాడుతున్నాయి. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అంజలి… ఓవైపు కథానాయికగా చేస్తూనే మరోవైపు స్పెషల్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ కూడా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వచ్చింది. అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇది కేవలం రూమర్ మత్రమే అని తేలింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి రూమర్స్‌పై స్పందించింది.
Anjali Marriage Rumors..
ఇటీవల ఓ ఈవెంట్ లో అంజలి మాట్లాడుతూ… ఇప్పటికే నాకు మూడు నాలుగు పెళ్లిళ్లు చేశారు. మొదట్లో ఇలాంటి వార్తలు విన్నపుడు బాధపడ్డా కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను. నాపై వస్తున్న వదంతుల కారణంగా నిజంగా ఓ వ్యక్తిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను… కానీ దానికి చాలా టైమ్ ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నానని ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే మూవీస్ చేస్తానని మాటిచ్చింది.
Also Read : SIT: ఓటీటీలో టాప్ 5లో ట్రెండ్ అవుతోన్న ‘సిట్’ సినిమా !