Anjali: ఎంవివి సినిమా బ్యానర్ పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ కామెడీ మూవీ ‘గీతాంజలి’. 2014లో విడుదలై విజయవంతమైన ‘గీతాంజలి’ సినిమాకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పేరుతో ఎం.వి.వి.సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులోనూ అంజలి(Anjali) ప్రధాన పాత్ర పోషిస్తుండగా… శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ ఈవెంట్ లో ఇటీవల తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్ పై అంజలి స్పందించారు.
Anjali Comment
‘నేను చేయగలిగిన పాత్రల అవకాశాలు నాకు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. అలా వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు కూడా వరుస చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. దీని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఉంది. తర్వాత ‘గేమ్ ఛేంజర్’ వస్తుంది. నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం రానుంది. 50వ చిత్రం చేస్తున్నప్పుడే మరో 6 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. అవన్నీ దర్శక నిర్మాతలు నాకోసం రాసినవే. ‘గీతాంజలి’ నాకు ప్రత్యేకం. పదేళ్ల క్రితం నేను హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రమది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో యాక్షన్ సన్నివేశాలు కూడా చేశాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా.. అందులోని సీత పాత్ర నాకు చాలా ఇష్టం’ అని చెప్పారు.
ఇక సోషల్ మీడియలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తూ.. ‘నాకు తెలియకుండానే ఇప్పటికి నాలుగుసార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో దీని గురించి విన్నాను. నేను పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని విషమేమిటంటే నేను అవుట్ డోర్ షూటింగ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఫేక్ న్యూస్. పెళ్లైతే చేసుకుంటా… కానీ ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైమ్ ఉంది’ అన్నారు.
Also Read : Trivikram Srinivas: నితేశ్ తివారీ ‘రామాయణ’కు త్రివిక్రమ్ మాటలు ?