Anjali: ఎంవివి సినిమా బ్యానర్ పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ కామెడీ మూవీ ‘గీతాంజలి’. 2014లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని హిట్ గా నిలిచింది. దీనితో సుమారు తొమ్మిదేళ్ళ తరువాత ‘గీతాంజలి’కు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సారి శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Anjali – 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
2014లో విజయవంతమైన ‘గీతాంజలి’కి కొనసాగింపుగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పేరుతో ఎం.వి.వి.సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులోనూ అంజలి(Anjali) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్మెన్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) నిర్మాతలుగా కొనసాగనుండగా కోన వెంకట్ కథని అందిస్తున్నారు.
ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చిన గీతాంజలి కథగా ఈ సినిమా రూపొందుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. హైదరాబాద్, ఊటీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఊటీలో చిత్రీకరించాల్సిన షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దక్షిణాది భాషలన్నింటిలో చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలకశంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజుసంగీతం అందిస్తున్నారు.
Also Read : Samuthirakani: బడా నిర్మాతకు సముద్రఖని స్వీట్ వార్నింగ్