Anita Hassanandani : తండ్రిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్

మా నాన్న గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి...

Anita Hassanandani : దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అనిత. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నఈ బ్యూటీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండగ వంటి చిత్రాల్లో నటించింది. నువ్వు నేను తర్వాత ఆ స్థాయిలో హిట్ రాకపోవడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. హిందీలో పలు సీరియల్స్ చేసిన అనిత(Anita Hassanandani).. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రికి తాగుడు అలవాటు ఉండేదని.. దీంతో అతడిపై ఎంతో కోపం పెంచుకున్నానని.. కానీ మన జీవితంలో తండ్రికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుందని చెప్పుకొచ్చింది.

Anita Hassanandani Emotional..

“మా నాన్న గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు సారీ నాన్న.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాకు కొడుకు ఆరవ్ పుట్టాకగానీ నీ ప్రేమ అర్థం కాలేదు. నువ్వు ఆరవ్ ను కలవాల్సింది. తనతో ఆడుకోవాల్సింది. ఎంతో పెద్ద తప్పు చేశాను ? మా నాన్న తాగుబోతు అని కోప్పడ్డాను.. మద్యానికి బానిసయ్యాడని.. అందులోనుంచి బయటకు వెళ్లలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను. నాన్నపై అంత కోపం చూపించాల్సింది కాదు. నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న మమ్మల్ని వదిలేసి పోయారు. అమ్మ ఒంటరిదైపోయింది. అప్పటికే అక్కకు పెళ్లి కావడంతో నేను ఒక్కదాన్నే ఉండిపోయాను.

దీంతో కుటుంబబాధ్యతలు తీసుకున్నాను. నటుడు మనోజ్ కుమార్ తనయుడు కునాల్ గోస్వామి ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరాను. అప్పుడు కునాల్ సోదరుడు నన్ను చూసి ఫోటో షూట్ ట్రై చేయు అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత నటనవైపు అడుగులు వేశాను” అంటూ చెప్పుకొచ్చింది. 1999లో హిందీ మూవీ తాల్ చిత్రంలో మొదటిసారిగా కనిపించింది. అందులో ఒక పాటలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత 2001లో విడుదలైన నువ్వు నేను సినిమాతో అలరించింది. ఫస్ట్ మూవీతోనే మెప్పించిన అనిత(Anita Hassanandani) ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది.

Also Read : Hero Dhanush : ముగింపు దశకు వచ్చిన ధనుష్, నిర్మాతల మధ్య పంచాయితీ

AnitaUpdatesViral
Comments (0)
Add Comment