Animal Park : యానిమల్ సీక్వెల్ పై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత

‘సందీప్‌వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’తో బిజీగా ఉన్నారు.

Animal Park : రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో గతేడాది విడుదలైన యానిమల్‌ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ రానుందని అప్పుడే ప్రకటించారు. మొదటి భాగం సీక్వెల్‌ ఉందంటూ దర్శకుడు వెల్లడించారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత భూషణ్‌కుమార్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

Animal Park Movie Updates

‘సందీప్‌వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ‘యానిమల్‌ పార్క్‌’ పనులు మొదలుపెడతాం. ఆరు నెలల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. ‘స్పిరిట్‌’ పూర్తయిన వెంటనే ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుంది. 2027లో సినిమాను విడుదల చేస్తాం’ అని భూషణ్‌కుమార్‌ తెలిపారు. మొదటి భాగం కంటే ఇందులో మరిన్ని బలమైన పాత్రలుంటాయి. గతంలో వచ్చిన చిత్రాలకంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్‌ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని సందీప్‌ వంగా తెలిపారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ ‘రామాయణ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది.

Also Read : Kiran Abbavaram : తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన ‘క’ సినిమా హీరో

animalAnimal ParkCinemaSequelTrendingUpdatesViral
Comments (0)
Add Comment