Animal Movie Update : యానిమ‌ల్ మూవీ అప్ డేట్

రెండు ఇంట‌ర్వెల్స్ ఉంటాయి

టాలీవుడ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన వంగా సందీప్ రెడ్డి హిందీలో సెన్సేష‌న్ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. త‌ను ర‌ణబీర్ క‌పూర్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో యానిమ‌ల్ తీశాడు. ఈ మూవీకి సంబంధించి పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత అనిల్ క‌పూర్ ఇందులో న‌టిస్తుండ‌డం విశేషం.

వంగా అంటేనే ముద్దుల‌కు పెట్టింది పేరు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీసిన అర్జున్ రెడ్డి, హిందీలో షాహిద్ క‌పూర్ మూవీ తో ఒక్క‌సారిగా త‌నేమిటో, సత్తా ఏమిటో నిరూపించాడు. రూ. 100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో తీస్తున్నాడు వంగా. ప్రాణం పెట్టి తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఎలాగైనా హిట్ రావ‌డం ప‌క్కా అన్నాడు వంగా సందీప్ రెడ్డి.

అంత న‌మ్మ‌కంతో ఉన్నాడు. ఇక వంగా మూవీ అంటే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఏ సినిమాకైనా ఒక్క‌సారి ఇంటెర్వ‌ల్ మాత్ర‌మే ఉంటుంది. తాజాగా అందిన స‌మాచారం ఏమిటంటే రెండు సార్లు ఇంటెర్వెల్స్ ఉంటాయ‌ని బిగ్ టాక్.

విచిత్రం ఏమిటంటే యానిమ‌ల్ మూవీ కోసం ఇప్ప‌టి నుంచే డిమాండ్ పెరుగుతోంది. ఎంతైనా ఖ‌ర్చు చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని క్యూ క‌డుతున్నారంట‌. ఇదీ క‌దా స‌త్తా అంటే. ద‌ర్శ‌కుడికి ఉన్న టేస్ట్ ఏమిటో. వైల‌న్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నాడు .

Comments (0)
Add Comment