Animal Movie : బాలీవుడ్ లో ఇంకా రిలీజ్ కాకుండానే భారీ మార్కెట్ ను సాధించిన చిత్రంగా దుమ్ము రేపుతోంది వంగా సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్(Animal). ఇందులో రణ బీర్ కపూర్ , రష్మిక మందన్నా , అనిల్ కపూర్ నటిస్తున్నారు.
Animal Movie Updates
సినిమాకు సంబంధించి రోజు రోజుకు అప్ డేట్స్ , ఫోటోలు , సాంగ్స్ ఇప్పటికే వైరల్ గా మారాయి. ఎక్కడ చూసినా వంగా గురించే చర్చ జరుగుతోంది. రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మరో వార్త వినిపిస్తోంది.
అదేమిటంటే యానిమల్ ఇంకా విడుదలనే కాలేదు. కానీ యానిమల్ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతోందని టాక్. వంగా సందీప్ రెడ్డి తీసింది కేవలం రెండు సినిమాలే. ఒకటి తెలుగులో మొదటగా రౌడీ బాయ్ గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి చిత్రం తీశాడు. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఈ మూవీని హిందీలో తీశాడు. షాహిద్ కపూర్, అనన్య పాండే ఇందులో హీరో హీరోయిన్లు. తాజాగా స్ట్రెయిట్ చిత్రానికి ప్రయారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు యానిమల్ తీశాడు.
Also Read : Chinmayi Sripada : మార్ఫింగ్ పై చిన్మయి ఆందోళన