Anil Sharma : తార‌క్ ఒక్క‌డే ఆ పాత్ర చేయ‌గ‌ల‌డు

గ‌ద‌ర్ -2 మూవీ డైరెక్ట‌ర్ అనిల్ శ‌ర్మ

Anil Sharma : బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ అనిల్ శ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ‌ద‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరింది. ఊహించ‌ని స‌క్సెస్. స‌న్నీ డియోల్, అమీషా ప‌టేల్ క‌లిసి న‌టించారు.

Anil Sharma Comments Viral

గ‌ద‌ర్ మూవీ మొద‌ట్లో తీశాడు అనిల్ శ‌ర్మ‌(Anil Sharma). భారీ స‌క్సెస్ సాధించింది. దీంతో సీక్వెల్ గా గ‌ద‌ర్ -2 తీశాడు. ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభకు జ‌నం ఫిదా అయ్యారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు డైరెక్ట‌ర్ అనిల్ శ‌ర్మ‌. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

గ‌ద‌ర్ -2 చిత్రం స‌క్సెస్ కావ‌డం ముందే ఊహించాన‌ని చెప్పాడు. ఈసారి క‌చ్చితంగా ఆస్కార్ అవార్డు రేసులో ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు అనిల్ శ‌ర్మ‌. ఇదే స‌మ‌యంలో గ‌ద‌ర్ – 2 చిత్రంలో ఒక వేళ స‌న్నీ డియోల్ గ‌నుక ఒప్పుకోక పోయి ఉండి ఉంటే ఆ పాత్ర‌ను న‌టించే ద‌మ్ము, ధైర్యం, స‌త్తా క‌లిగిన ఏకైక న‌టుడు టాలీవుడ్ కు చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మేన‌ని అన్నారు.

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ అనిల్ శ‌ర్మ తార‌క్ పై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తార‌క్ గురించి చెప్ప‌డం అంటే ఇత‌ర న‌టుల‌ను తాను త‌క్కువ చేసిన‌ట్లు కాద‌ని స్ప‌ష్టం చేశాడు ద‌ర్శ‌కుడు అనిల్ శ‌ర్మ‌.

Also Read : Jawan Advance Booking : జ‌వాన్ టికెట్లకు భారీ డిమాండ్

Comments (0)
Add Comment