Anil Ravipudi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). తను తీసిన సినిమాలన్నీ బిగ్ హిట్టే. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దిల్ రాజు , శిరీష్ సంయుక్త నిర్మాణంలో విక్టరీ వెంకటేశ్, అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్ల మార్క్ కు దగ్గరగా చేరింది ఈ చిత్రం.
Anil Ravipudi Movie Updates
ఇంటిల్లిపాది కలిసి చూసేలా సినిమాలు తీస్తూ తనకుంటో ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్. తను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎన్నో ఉద్యోగాలు వచ్చినా డోంట్ కేర్ అన్నాడు. తనకు ముందు నుంచీ సినిమాలంటే పిచ్చి ప్రేమ. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇదే సమయంలో తనలోని టాలెంట్ ను గుర్తు పట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. తనకు జీవితంలో మరిచి పోలేని రీతిలో ఛాన్స్ ఇచ్చాడు. అదే పటాస్.
సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత మాస్ మహరాజాతో సినిమా చేశాడు. అది కూడా బిగ్ హిట్. ఇదే సమయంలో ప్రిన్స్ మహేష్ బాబుతో తక్కువ రోజుల్లోనే సరిలేరు నీకెవ్వరు అంటూ మూవీ తెరకెక్కించాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా, విజయ శాంతి, సంగీత నటించారు. కామెడీ , సస్పెన్స్ థ్రిల్లర్ గా తీశాడు.
ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా తో ఎఫ్ 2 పేరుతో రిలీజ్ చేశాడు. ఇది నవ్వుల నజరానాగా నిలిచింది. కాసులు కురిపించడంతో సీక్వెల్ గా ఎఫ్-3 తీశాడు. ఇది బాక్సులు బద్దలు కొట్టింది. తాజాగా విక్టరీ వెంకటేశ్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్బంగా అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు బెస్ట్ ఫ్రెండ్ సప్తగిరి అని అయినా తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేక పోయానని వాపోయాడు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Hero Bunny-Pushpa 2 : ఓటీటీ లోనూ ‘పుష్ప-2’ తగ్గేదేలే