Anee Master: టాలీవుడ్ లో టాప్ లేడీ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్… సరదాగా డ్యాన్స్ చేస్తూ జారి పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తెలుగులో చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు స్టెప్పులు వేయించిన యానీ మాస్టర్‌కు చాలామందే అభిమానులు ఉన్నారు. కొద్దిరోజులుగా మహేశ్ బాబు కూతురు సితారకు డ్యాన్స్‌లో శిక్షణ కూడా ఇస్తున్నారు.
Anee Master Met with An Accident…
తాజాగా యానీ మాస్టర్(Anee Master) వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తుండగా… వర్షపు చినుకుల వల్ల ఆమె కాలు ఒక్కసారిగా జారింది. దీనితో డ్యాన్స్ చేస్తూనే ముందుకు పడిపోయారు. ఆమె ముఖానికి గాయమైనట్లు అనిపిస్తుంది. అయితే ఆమె వర్షంలో జారిపడ్డ వీడియో రికార్డు కావడంతో… ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యానీ మాస్టర్ దేవుడి దయ వల్ల తనకు ఎలాంటి గాయం కాలేదని తెలిపారు. తమకు డ్యాన్స్ తప్పా మరోకటి తెలియదని చెబుతూనే ఇలాంటి సమయంలో డ్యాన్సర్స్ బాధలు ఎలా ఉంటాయో తెలియాలనే ఈ వీడియో పెట్టినట్లు తెలుస్తోంది. డ్యాన్స్ చేస్తున్నప్పడు జాగ్రత్త మేడం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సినీ పరిశ్రమ అంటే అమ్మాయిలు భయపడతారు. అలాంటిది ఎలాంటి జంకు లేకుండా ఒక డ్యాన్సర్‌గా యానీ మాస్టర్ రాణిస్తున్నారు. రఘు, శేఖర్, నిక్సన్, గణేశ్ వంటి మాస్టర్స్ వద్ద అసిస్టెంట్ గా ఆమె చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్‌లో వెండితెరపై కనిపించిన యానీ మాస్టర్ తనలో దాగి ఉన్న నటన కూడా బయటిప్రపంచానికి పరిచయం చేశారు.
Also Read : Prabhas : రీల్ లైఫ్ లోనేకాకుండా రియల్ లైఫ్ లో కూడా గొప్ప మనసు చాటుకున్న డార్లింగ్