Anee Master : జానీ మాస్టర్ అరెస్ట్ పై మరోసారి స్పందించిన ‘అని మాస్టర్’

జానీ మంచివారు.. ఎందుకో వారిపై ఆరోపణలు రావటం బాధాకారం....

Anee Master : మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలపై కొరియోగ్రాఫర్ అని మాస్టర్(Anee Master) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో అని మాస్టర్(Anee Master) మాట్లాడుతూ… జానీపై కేసు పెట్టడంతో తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం‌ బాధించిందన్నారు. అది తెలుగు టెక్నిషియన్ కి ఇచ్చిన పురస్కారమన్నారు. జానీ తప్పు చేసినట్లు ఫ్రూవ్ కాలేదని.. తాను జానీ దగ్గర రెండు సంవత్సరాలు వర్క్ చేసినట్లు చెప్పారు.

Anee Master Comment

‘‘జానీ మంచివారు.. ఎందుకో వారిపై ఆరోపణలు రావటం బాధాకారం..తప్పు జరిగితే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తెలితే ఏంటి..!! లేడి కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నా.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్టపడాలి. ‌ కెరీర్‌లో ఎప్పుడు నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు. విక్టిమ్ కొన్ని రోజుల వరకు జానీని దేవుడు అని చెప్పింది.. విక్టిమ్ జానీ మాస్టర్ వద్ద వర్క్‌ చేసేటప్పుడు హ్యాపీగా ఉండేది. కానీ సడెన్‌గా ఆరోపణలు చేయటాన్ని ఎలా చూడాలి..!! ’’ అని అన్నారు.

‘‘జానీ నాకు గురువు.. ఆయన ఇలా జైలులో ఉండటం ఏ మాత్రం కరెక్ట్ కాదనిపిస్తోంది.. అమ్మాయి విషయం కాబట్టి సెన్సిటివ్ విషయం కాబట్టి..ఎవరు మాట్లాడలేకపోతున్నారు? జానీపై ఇండస్ట్రీలోనే కుట్ర పన్నారనే విషయంపై నేను మాట్లాడలేను.. ఏ యూనియన్‌లోనైనా ఇష్యూస్ ఉంటాయి. డాన్సర్‌ కు హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ హెల్ప్ చేసేది జానీ, శేఖర్, భాను మాస్టర్స్. డాన్స్ మాస్టర్స్ యూనియన్ స్ట్రాంగ్‌‌‌గా ఉంటుంది. గతంలో విక్టిమ్‌కు డాన్స్ యూనియన్ కార్డ్ కోసం జానీ మాస్టర్ వైఫ్ గట్టిగా అడిగారు.. విక్టిమ్‌కు కార్డ్ ఇవ్వాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి.. కానీ జానీ అధ్యక్షుడిగా ఆమె కార్డ్ ఇవ్వకుండా తొక్కి పెట్టారనటం తప్పు.. జానీ కేసు జడ్జిమెంట్ కోసం అందరం వెయిటింగ్‌లో ఉన్నాము’’ అని అని మాస్టర్ చెప్పుకొచ్చారు.

Also Read : Jai Hanuman : ‘జై హనుమాన్’ లో హనుమాన్ పాత్రకు ఆ పాన్ ఇండియా స్టార్

Anee MasterCommentsJani MasterUpdatesViral
Comments (0)
Add Comment