Mowgli Movie : తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న యాంకర్ సుమ తనయుడు

ఇప్పుడు ‘మోగ్లీ’ పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో యూనిక్ రోల్‌లో కనిపించనున్నారు...

Mowgli : ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల.. ఇప్పుడు తన రెండో చిత్రంతో రెడీ అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ వినాయక చతుర్థి శుభ సందర్భంగా ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. తన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టొరీ కోసం యంగ్ హీరో రోషన్ కనకాలతో కలిసి పని చేయబోతున్నారు.

Mowgli Movie Updates

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. రోషన్ కనకాల, తన మొదటి సినిమాలో ఇచ్చిన పెర్ఫార్మెన్స్, చేసిన డ్యాన్స్‌లతో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘మోగ్లీ(Mowgli)’ పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో యూనిక్ రోల్‌లో కనిపించనున్నారు. ఆ విషయం ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో రోషన్ కనకాల వెస్ట్ ధరించి, సాలిడ్ ఫిజిక్, దట్టమైన అడవిలో గుర్రంతో పాటు చిరునవ్వుతో నడుచుకుంటూ వస్తున్నారు.

ఈ పోస్టర్ విజువల్‌గా చూడగానే సూపర్బ్ అనేలా ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ‘ కలర్ ఫోటో’కు సక్సెస్‌ఫుల్ ఆల్బమ్‌ అందించిన కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. బాహుబలి1 మరియు 2, RRR వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి M సినిమాటోగ్రఫీని బాధ్యతలను నిర్వహించనున్నారు. ‘ కలర్ ఫోటో, మేజర్’.. అప్ కమింగ్ ‘గూఢచారి 2’ వంటి చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిటర్‌. ‘మోగ్లీ’ని 2025 సమ్మర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ ఈ పోస్టర్‌తో పాటు ప్రకటించారు.

Also Read : Meghali Meenakshi : కన్నడ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన తమిళ నటి

Anchor SumaCinemaHero RoshanTrendingUpdatesViral
Comments (0)
Add Comment