Anatomy of a Fall: ఓటీటీలోనికి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ !

ఓటీటీలోనికి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' !

Anatomy of a Fall: వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు సాధించి… ఇటీవల ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఓటీటీలోనికి అందుబాటులోనికి వచ్చింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌ లో ఇంగ్లీష్‌ వర్షన్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా రిజినల్‌ లాంగ్వేజెస్ అయిన తెలుగు,తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. ఫ్రెండ్ లీగల్ డ్రామా 2023లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ అవార్డును దక్కించుకుంది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వంద‌కుపైగా అవార్డుల‌ను గెలుచుకున్న‌ సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సాండ్ర హ‌ల్ల‌ర్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఈ ఏడాది బెస్ట్‌ నటిగా ఆమెకే ఆస్కార్‌ అవార్డు దక్కుతుందని అందరు భావించారు. కానీ తృటిలో ఆమెకు ఆస్కార్ అవార్డును మిస్స‌యింది.

Anatomy of a Fall OTT Updates

జస్టిన్ ట్రియెట్, ఆర్థర్ హరారీ సంయుక్తంగా రాసిన ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్(Anatomy of a Fall)’ స్క్రీన్ ప్లేకు జస్టిన్ ట్రియెట్ దర్శకత్వం వహించారు. ఇందులో సాండ్రా హుల్లర్ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా నటించారు. ఈ చిత్రంలో సాండ్రా హుల్లర్ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా నటించారు. మంచుకొండ‌ల్లోని త‌న ఫ్యామిలీతో ఒంట‌రిగా సాండ్రా జీవిస్తుంటుంది. తన భ‌ర్త అనుమాన‌స్ప‌ద రీతిలో అక్కడ మరణించడం. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మ‌రెవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమె ఈ హ‌త్య చేసింద‌ని పోలీసులు అనుమానిస్తుంటారు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో నడిచే ఈ కథలో అస‌లు ఈ హ‌త్య ఎవ‌రు చేశారు ? ఈ నేరం నుంచి సాండ్రా ఎలా బ‌య‌ట‌ప‌డుతుంది అనేది కథను దర్శకుడు ఆద్యంతం ఉత్కంఠభరితంగా దర్శకుడు జస్టిన్ ట్రియెట్ తెరకెక్కించాడు.

Also Read : Meenakshi Chaudhary: బాక్సింగ్‌ శిక్షణలో మహేశ్ బాబు బ్యూటీ !

amazon primeAnatomy of a FallOscar Awards
Comments (0)
Add Comment