Ananya Pandey: లాయర్ కాబోతున్న అనన్యపాండే !

లాయర్ కాబోతున్న అనన్యపాండే !

Ananya Pandey: ‘లై గర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్యపాండే. ఇటీవలే విడుదలైన ‘డ్రీమ్‌గర్ల్‌ 2’తో కుర్రకారుని ఆకట్టుకున్న ఆమె… ఇప్పుడు మరోసారి తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ తో కలిసి అనన్యపాండే… ‘ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సి.శంకరన్‌ నాయర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందు కాబోతుంది. ‘ది కేస్ దట్ షుక్ ది అంపైర్’ అనే పుస్తకం ఆధారంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వం వహిస్తున్నారు.

Ananya Pandey As Adcovate Role

ఇందులో అనన్యకు మెంటార్‌గా అక్షయ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ‘కోర్టు రూమ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇందులో అనన్య, అక్షయ్‌ మధ్యలో గురుశిష్యుల అనుబంధం ఉంటుందని సమాచారం. అనన్య జూనియర్ న్యాయవాదిగా కనిపించగా… ఆమెకు మెంటర్ గా అక్షయ్ కుమార్ కనిపించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Also Read : Mangalavaram: ఓటీటీలోకి ‘మంగళవారం’… స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

akshay kumarAnanya Pandey
Comments (0)
Add Comment