Beauty Ananya Panday Praises :దీపికా ప‌దుకొణేను చూసి ఎంతో నేర్చుకున్నా

సినీ న‌టి అన‌న్య పాండే కీల‌క వ్యాఖ్య‌లు

Ananya Panday : బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది దీపికా ప‌దుకొణే. త‌ను ఫిలిం ప్రాజెక్టుపై బిజీగా ఉంది. ఈ సంద‌ర్బంగా త‌న గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు యువ న‌టి అన‌న్య పాండే(Ananya Panday). త‌ను కీల‌క పాత్ర‌లో న‌టించింది ఆ మ‌ధ్య‌న పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లైగ‌ర్ మూవీలో. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించాడు. కానీ ఆ చిత్రం ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా ఈమ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా స్పందించింది యువ న‌టి. దీపికా ప‌దుకొణేపై ప్ర‌శంస‌లు కురిపించింది.

Ananya Panday Praises Deepika Padukone

త‌న నుంచి ఎన్నో నేర్చుకున్నాన‌ని న‌ట‌నా ప‌రంగా. ఎవ‌రితో ఎలా ఉండాలో, టైంకు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కు ఎలా రావాలో, ఇత‌రుల ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించాలో త‌న నుంచి చూశాన‌ని తెలిపారు అన‌న్య పాండే. ఇంత‌కు ఈ న‌టి ఎవ‌రో కాదు. గ‌తంలో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు పొందిన చుంకీ పాండే కూతురే ఈమె. 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ – 2 సినిమాతో ఇండ స్త్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా రంగంలోకి వ‌చ్చి చాన్నాళ్ల‌వుతున్నా ఇంకా బిగ్ హిట్ రాలేదు.

ఇదిలా ఉండ‌గా దీపికా ప‌దుకొనే తో క‌లిసి అన‌న్య పాండే గెహ్రియాన్ సినిమాలో న‌టించింది. సెట్ లో మ‌న‌ల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియ‌దు. అందుకే నిర్దేశించిన షెడ్యూల్ కంటే ముందుగా చేరుకోవాల‌ని తాను దీపికా ప‌దుకొణేను చూసి తెలుసుకున్నాన‌ని చెప్పింది అన‌న్యా పాండే. త‌ను అంత టాప్ హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా భేష‌జాలు , గ‌ర్వం చూడ‌లేద‌న్నారు.

Also Read : Beauty Samantha-Sukumar RC17 :సుకుమార్ న్యూ మూవీలో స‌మంత..?

Ananya PandayCommentsDeepika PadukonePraisesTrendingViral
Comments (0)
Add Comment