Ananya Nagalla: ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.
Ananya Nagalla Movies
మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల(Ananya Nagalla)… వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది ‘తంత్ర’ అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ‘పొట్టేల్’ అనే మూవీ ఉంది.
మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే ‘బహిష్కరణ’ సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
Also Read : Vijay Sethupathi : తన లైఫ్ కోసం కీలక వ్యాఖ్యలు వెల్లడించిన విజయ్ సేతుపతి