Ananya Nagalla : టాలీవుడ్ లో సీన్ మారింది. ఇతర ప్రాంతాలకు చెందిన హీరోయిన్లు ఎక్కువగా డామినేట్ చేసే వారు. కానీ ఇప్పుడు దర్శక, నిర్మాతలు టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా పర్వాలేదంటున్నారు. మంచి పాత్రలు ఇచ్చేందుకు ఓకే చెబుతున్నారు. ప్రధానంగా తెలుగు వారికి అవకాశాలు దక్కుతుండడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. వైష్నవి చైతన్యతో పాటు అనన్య నాగళ్ల కూడా హాట్ టాపిక్ గా మారారు. వైష్ణవి ప్రస్తుతం జొన్నలగడ్డ సిద్దుతో కలిసి జాక్ మూవీలో నటించింది.
Ananya Nagalla Web Series
ఇక అనన్య నాగళ్ల(Ananya Nagalla) మాత్రం ఫుల్ బిజీగా మారి పోయింది. తను సినిమాలలో మంచి పాత్రలు చేస్తూనే ఇంకో వైపు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది. తను కేవలం ప్రతిభ, నటనపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుండడంతో వెబ్ సీరీస్ లలో ఎక్కువగా ప్రయారిటీ దక్కుతోంది. తను వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసింది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి చేనేత కార్మికుల జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం చిత్రంలో కీ రోల్ పోషించింది. ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. పలు అవార్డులను స్వంతం చేసుకుంది.
అనన్య నాగళ్ల ప్లే బ్యాక్, వకీల్ సాబ్ మూవీస్ లో భిన్నమైన పాత్రలు పోషించింది. తంత్ర, పోటెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కంటెంట్ రిచ్ ప్రాజెక్టులలో నటించింది. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో మంచి ప్రదర్శన ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రస్తుతం తనకు బాలీవుడ్ లో ఓ మూవీలో నటించేందుకు తను ఓకే చెప్పినట్టు టాక్.
Also Read : Hero Ram Charan-Peddi :చెర్రీ పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ కెవ్వు కేక